అన్వేషించండి
నమోదు చేసుకోండి
సద్గురు
Login

ఆన్‌లైన్
సమర్పణలు

యోగ మరియు ధ్యానంరోగనిరోధక శక్తిని పెంచేవివంటకాలు

కష్ట సమయాల గుండా ఆంతరంగిక సానుకూలతతో ప్రయాణిస్తే, మీరు ఎదుర్కొనే ప్రతీ పరిస్థితీ మీ జీవితాన్ని మెరుగుపరుస్తుంది.
- సద్గురు

ప్రపంచమంతా మహమ్మారి ప్రబలిన సమయంలో
అంతరంగ సమతౌల్యాన్ని కలిగి ఉండడం

మనం అసాధారణమైన, అనిశ్చితి నెలకొన్న సమయాలలో జీవిస్తున్నాము. అంతర్జాతీయ మహమ్మారి కరోనా వైరస్ (COVID-19) అమెరికాలో ఇంకా విజృంభిస్తూ ఉండడంతో, మా దైనందిన జీవితాల్లో నాటకీయమైన మార్పులు చోటుచేసుకున్నాయి. తీవ్ర సంక్షోభం నెలకొన్న ఈ తరుణంలో, ఆందోళన ఇంకా ఒత్తిడులు మిమ్మల్ని సులువుగా కుంగదీయగలవు. మీలో ప్రశాంతత, అంతరంగ సమతుల్యత ఇంకా శ్రేయస్సులను కలిగి ఉండడం ఇప్పుడు చాలా ముఖ్యం.

ఈశా ఫౌండేషన్ మీ ఆరోగ్యాన్ని ఇంకా రోగనిరోధక శక్తిని పెంపొందించే యోగిక ఆరోగ్య విధానాలతో పాటు మీ శ్రేయస్సును చేకూరే విధంగా అనేక యోగ మరియు ధ్యాన సాధనాలను ఆన్‌లైన్ ద్వారా అందుబాటులోకి తెస్తుంది.

సద్గురు నుండి రోజువారీ సాధన

అందరికీ సహాయపడేలా ఈ క్రింద ఇవ్వబడిన రోజువారీ సాధనలను సద్గురు అందించారు, తద్వారా మనం శారీరకంగా ఇంకా మానసికంగా కూడా ఈ క్లిష్ట సమయాల గుండా తక్కువ ఘర్షణతో కొనసాగగలం.

  • సింహ క్రియ అనేది రోగనిరోధక శక్తిని పెంపొందించి, ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని మెరుగుపరచ గల ఒక సులభమైన యోగ ప్రక్రియ.
  • 12 సార్లు యోగ యోగ యోగేశ్వరాయ స్తుతి చేసిన తరువాత ఈశా క్రియ చేయాలి

మీరు ఈ సాధనలను క్రింది లింక్ ల ద్వారా నేర్చుకోగలరు. అటు పిమ్మట, మీ అంతట మీరుగా గానీ లేదా వీడియోల సహాయంతో గానీ సాధన చేయవచ్చు

అదనపు సహకారం

పరివర్తన కోసం యోగ సాధనాలు, వెబినార్ల ద్వారా మీకు ఆరోగ్యం ఇంకా శ్రేయస్సు అందించేందుకు తగిన చిట్కాలు, న్యూస్ లెటర్స్ ఇంకా మరిన్ని రూపాలలో మీరు అదనపు సహాయం కోరుకుంటున్నట్లయితే, దయచేసి క్రింద రిజిస్టర్ అవ్వండి.

ఇప్పుడే రిజిస్టర్ చేసుకోండి

ఉచిత గైడెడ్ ధ్యానాలు

ఈశా క్రియ

ఈశా క్రియ అనేది సద్గురు చే రూపొందించబడిన సమర్థవంతమైన గైడెడ్ ధ్యానం. "ఈశా" అంటే ఏదైతే సృష్టికి మూలమో అది. "క్రియ" అంటే ఆ మూలాన్ని కనుగొనే ఆంతరంగిక చర్య.

హార్వర్డ్ మెడికల్ స్కూల్ నిర్వహించిన పరిశోధనలో, ఈ ధ్యాన ప్రక్రియ ద్వారా, ఆందోళన, కోపం, నిస్సత్తువ, కంగారు ఇంకా నిరుత్సాహాలు తగ్గినట్టు ఋజువైంది.

పరిశోధన ఫలితాలు >

వ్యవధి: 12 - 18 నిమిషాలు
వెబినార్ ద్వారా కూడా అందించబడుతుంది

వెబినార్ కు రిజిస్టర్ అవ్వండి
ధ్యానం చేయండి

సృష్టించే సామర్థ్యం (బండిల్)

జీవితంలో మీరు కోరుకున్నదానిని సృష్టించేందుకు మన: శ్శక్తిని ఉపయోగించడాన్ని చిత్ శక్తి అంటారు. చిత్ శక్తి గైడెడ్ ధ్యానాలు నాలుగు, ఉచితంగా అందుబాటులో ఉన్నాయి. అవి మీ జీవితంలో ప్రేమ, ఆరోగ్యం, శాంతి ఇంకా విజయాలను సృష్టించేందుకు సహాయపడతాయి.

వ్యవధి: 20 నిమిషాలు

అనంతమైన ధ్యానం

అనంతమైన ధ్యానం, మనలోని శక్తులలో స్థిరత్వాన్ని మరియు సమతౌల్యతను తీసుకువచ్చేందుకు సద్గురుచే రూపొందించబడింది మనం అవధుల్లేని స్థితిని అనుభూతి చెందేందుకు అది అవకాశాన్ని కల్పిస్తుంది.

వ్యవధి: 30 నిమిషాలు (సూచనలతో కూడి ఉంటుంది)
20 నిమిషాలు (ధ్యానం)

ఉచిత యోగ సాధనలు

యోగా అందించే శారీరక మరియు మానసిక ప్రయోజనాలను ఆస్వాదించేందుకు సత్వర మార్గం, ఈశా యోగా టూల్స్ యాప్ ను ఉచితంగా డౌన్లోడ్ చేసుకోవడం. యోగ శాస్త్రం ఆధారంగా సద్గురు చే రూపొందించబడిన ఈ 5- నిమిషాల సాధనలు రోజూ చేయడం వల్ల, మీ జీవితాన్ని పరివర్తన చెందించగలవు!

ఇన్నర్ ఇంజినీరింగ్ ఆన్లైన్

"బాహ్య శ్రేయస్సు కోసం శాస్త్రసాంకేతికత విజ్ఞానం ఉన్నట్టుగానే, అంతరంగ శ్రేయస్సు కోసం కూడా అపారమైన శాస్త్రసాంకేతిక పరిజ్ఞానం ఉంది."
- సద్గురు

ఇన్నర్ ఇంజినీరింగ్ శ్రేయస్సు చేకూర్చే సాంకేతికత. ఇది యోగ విజ్ఞానం నుండి సంగ్రహించబడినది. జీవితంలోని ప్రాథమిక అంశాలను పరిష్కరించేందుకు ఇంకా ప్రాచీన విజ్ఞానంలో దాగి ఉన్న రహస్యాలను పొందేందుకు, శక్తివంతమైన ఆత్మపరివర్తన ప్రక్రియలు, శాస్త్రీయమైన యోగా సారం, ధ్యాన క్రియల ద్వారా మీరు మీ అత్యుత్తమ సామర్థ్యాన్ని అన్వేషించేలా చేయడం ఈ కార్యక్రమం యొక్క లక్ష్యం.

మీకు వీలైన చోటునుండి, మీకు వీలైనంత సమయంలో, సద్గురుతో ఇన్నర్ ఇంజినీరింగ్ ఆన్‌లైన్(IEO) అనుభూతిని పొందండి. ఇన్నర్ ఇంజినీరింగ్ ఆన్‌లైన్, ప్రాచీన యోగ శాస్త్రం నుండి గ్రహించబడి, మీరు మీ జీవితాన్ని జీవించే, నిర్వహించుకునే ఇంకా అనుభూతి చెందే విధానాన్ని పరివర్తన చెందించే సామర్థ్యం గల శక్తివంతమైన సాధనాలతో కూడిన ఏడు 90-నిమిషాల సెషన్లను కలిగి ఉంటుంది.

మీ రోగనిరోధక శక్తిని పెంచేందుకు సమగ్ర విధానాలు

యోగ శాస్త్రం, మీ రోగనిరోధక శక్తిని పెంచి, ఇనుమడింపజేసేందుకు ఇంకా మీ మొత్తంగా మీ ఆరోగ్యం ఇంకా శ్రేయస్సుకు దోహదం చేసేందుకు అనేక సహజ నివారణ మార్గాలను తెలియజేస్తుంది.

వేప

వేప అనేది వేప చెట్టు నుండి లభించే ఒక సహజ ఓషధి దానిని రోజూ తీసుకోవడం వల్ల జీర్ణకోశ, శ్వాసకోశ, ప్రసరణ వ్యవస్థలు, మూత్రాశయ ఇంకా ప్రత్యుత్పత్తి వ్యవస్థలకు ప్రయోజనం చేకూరుతుంది. విస్తృత స్థాయిలో, వేప అనేది శరీరాన్ని శుద్ధి చేసి ఆరోగ్య కరమైన కణజాలాలను పునరుద్ధరిస్తుంది. వివిధ వైద్య పరమైన ఆధారాల ప్రకారం, ప్రతిరోజూ వేపను తీసుకోవడం వల్ల ఈ క్రింది ప్రయోజనాలు చేకూరతాయి:

  • జీర్ణక్రియ వ్యవస్థను ఆరోగ్యవంతంగా ఉంచడంలో సహకరిస్తుంది
  • రోగనిరోధక వ్యవస్థను ఇంకా కాలేయం పనితీరును మెరుగుపరుస్తుంది.
  • మెటబాలిజం సజావుగా సాగేందుకు సహకరిస్తుంది
  • శ్వాసకోశ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడంలో సహకరిస్తుంది
  • యాంటీ-బాక్టీరియల్, యాంటీ-వైరల్, యాంటీసెప్టిక్ మరియు యాంటీఫంగల్
  • రక్తంలో చక్కెర ఆరోగ్యకరమైన స్థాయిల్లో ఉంచడంలోనూ, రక్త శుద్ధికి ఇంకా విషపదార్ధాలను తొలగించడంలోనూ సహకరిస్తుంది

పసుపు

పసుపు దుంపల మొక్క నుండి వచ్చే సుగంధ ద్రవ్యం పసుపు. ఆసియాలోని వంటకాలలో పసుపును సర్వసాధారణంగా వాడతారు. కూరల్లో, పసుపు ప్రధానమైనది అని బహుశా మీకు తెలిసే ఉండవచ్చు. ఔషదుల తయారీలో కూడా పసుపును విరివిగా వాడుతారు.

Benefits:
  • శరీరంలో జడత్వాన్ని తగ్గిస్తుంది
  • కీళ్ళను ఆరోగ్యంగా ఉంచుతుంది
  • రక్తం, శరీరం ఇంకా శక్తుల శుద్ధీకరణలో సహకరిస్తుంది
  • శ్వాసకోశాల పనితీరులో సహకరిస్తుంది
  • కాన్సర్ ను నివారించగలదు

రాగి

రాగి పాత్రలలో ఉంచిన నీరు, మన శరీర వ్యవస్థలో ఉండే వివిధ రకాల విషపదార్థాలను తొలగించడంలో అమోఘంగా పనిచేస్తుంది.

"నీటికీ స్మృతి ఉంటుంది కాబట్టి, దానిని ఎలా మనం నిల్వచేస్తాం అనే దానిపై మనం చాలా పట్టింపుతో ఉంటాం. మీరు నీటిని రాగి పాత్రలో కనీసం నాలుగు గంటల పాటు ఉంచినట్లయితే(రాత్రంతా ఉంచితే మరీ మంచిది), రాగి నుండి ఒక నిర్దిష్టమైన లక్షణాన్ని నీరు పొందుతుంది. అది ముఖ్యంగా మీ కాలేయానికి ఇంకా మీ ఆరోగ్యానికి, శక్తికీ చాలా మంచిది.సద్గురు

రాగి ఒక సూక్ష్మ జీవ నాశిని కొన్నిసార్లు అది నిమిషాల వ్యవధిలో బాక్టీరియా ఇంకా వైరస్ లను నశింపజేస్తుంది. పరిశోధనా అధ్యయనాలు

హెర్బల్ జామ్

ఆయుర్వేద హెర్బల్ జామ్, యాంటీ ఆక్సిడెంట్స్ ను సమృద్ధిగా కలిగి, వయసు పైబడడాన్ని నెమ్మది పరిచే ఫార్ములా. ఇది 4000 సంవత్సరాల నాటి ఫార్ములా, సాంప్రదాయకంగా దీర్ఘాయువు కోసం అమృతంగా ఉపయోగించబడింది. ఒక గొప్ప శక్తివర్ధిని, రోగనిరోధక శక్తిని పెంచుతుంది. అది డీ-టాక్సిఫికేషన్, జీర్ణ క్రియ పనితీరు, రక్తంలో చక్కెర ఇంకా కొలెస్ట్రాల్స్ ను ఆరోగ్యవంతమైన స్థాయిలలో ఉండేలా చేస్తుంది. ఈ రుచికరమైన మిశ్రమం హిమాలయాలలో దొరికే ఉసిరి కాయలను సహజసిద్ధమైన మూలికలు ఇంకా సుగంధ ద్రవ్యాలలో కలిపి తయారుచేయబడింది. ఆయుర్వేద హెర్బల్ జామ్ యవ్వనాన్ని, హుషారుని ఇంకా ప్రాణశక్తినీ పెంపొందిస్తుంది.

మీ రోగ నిరోధక శక్తిని పెంచే వంటకాలు

సులభమైన రుచికరమైన భోజనం

పాలకూర కిచిడీ(పాలకూర, కాయ ధాన్యాలు ఇంకా అన్నం గంజి)

మీకు అస్వస్థత లేక అనారోగ్యం కలిగినప్పుడు ఈ వంటకం గొప్ప మేలు చేస్తుంది. కేవలం ఉపశమనాన్ని కలిగించడమే కాకుండా, ఇది విటమిన్లు, ఐరన్ మరియు మెగ్నీషియంలను కలిగి ఉండి, మీ రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయపడుతుంది.

ఎలా తీసుకోవాలి: 3-4

కావలసిన పదార్ధాలు:

  • 1 కప్పు లావు బియ్యం
  • 1/2 కప్పు పెసరపప్పు
  • 1.5 టీ-స్పూన్ ఉప్పు
  • 4 కప్పుల నీరు
  • 1/2 కేజీ పాలకూర
  • 1/2 కప్పు అల్లం
  • 3 టీ-స్పూన్ల నెయ్యి, వడ్డించడానికి మరి కొంచెం
  • 1 టీ-స్పూన్ జీలకర్ర
  • 1 టీ-స్పూన్ నల్ల మిరియాలు

చేసే విధానం:

  1. బియ్యం ఇంకా పప్పుని కడిగి, ఆ నీటిని తొలగించాలి. బియ్యం, పప్పు, నీరు, ఉప్పు ప్రెజర్ కుక్కర్ లో వేసి, 6 నిమిషాల పాటు ఉడికించిన తరువాత, మంట ఆర్పేసి, కుక్కర్ లో ఉన్న ప్రెజర్ సహజంగా బయటకు వెళ్ళడానికి 5 నిమిషాల పాటు ఉంచాలి.
  2. ఒక పెద్ద కుండలో 8 నుండి 10 కప్పుల నీటిని మరిగించాలి. పాల కూర అందులో వేసి, 1 నుండి 2 నిమిషాలు రంగు మారేవరకు ఉంచాలి లేదా మొత్తం మగ్గనివ్వాలి. నీటిని పూర్తిగా తొలగించాలి
  3. అల్లం, మగ్గిన పాలకూర ఇంకా నల్ల మిరియాలు మిక్సర్ లో వేసి, మెత్తని పేస్ట్ లా చేయాలి.
  4. కుండలో నేతిని వేడిచేయాలి. జీలకర్ర అందులో వేసి, చిటపటలాడేంత వరకూ షుమారు 30 సెకన్లు వేయించాలి. పాలకూర పేస్ట్ లో ఉప్పు వేసి కలియబెట్టాలి. అప్పుడు ఉడికించిన అన్నం, పప్పు వేసి(పైన 1 వస్టెప్ నుండి), అన్నిటినీ కలపాలి. బాగా నెయ్యి దట్టించి, రుచి కోసం తాజాగా నూరిన మిరియాలను వేసి, వేడి వేడిగా వడ్డించాలి.

చిలగడదుంప, కాలే(క్యాబేజి రకము) మరియు అల్లం

ఎలా తీసుకోవాలి: 2

కావలసిన పదార్ధాలు:

  • 3/4 అంగుళాల అల్లం ముక్క (తాజాది)
  • 1/4 కేజీ కాలే
  • ఉప్పు - 2 చిటికెలు
  • 1 టీ-స్పూన్ నెయ్యి లేదా కొబ్బరి నూనె
  • 2 కప్పుల చిలగడదుంప

చేసే విధానం:

  1. కాలే ఆకులను ముదురు ఆకుపచ్చ రంగులోకి మారేంత వరకూ మరిగించాలి.
  2. వేరే పాత్రలో, తరిగిన చిలగడదుంపలను వేసి, అవి మునిగేంత వరకూ సరిపడా నీటిని పోయాలి. ఉప్పు వేసి, అవి మెత్తగా అయ్యేంత వరకూ ఉడికించుకోవాలి. మంట పై నుండి దించి, ఆ ఉడికించగా మిగిలిన తియ్యని నీటిని, వేరుచేసి తరువాత తాగవచ్చు.
  3. అల్లాన్ని తరిగి, నేతిలో ముప్పై సెకన్ల పాటు వేయించాలి. అందులో ఉడికించిన చిలగడదుంపలు, కాలే ఇంకా రుచికోసం ఉప్పు వేయాలి. మెత్తగా ఉడికిన చిలగడదుంపలు విరిగిపోకుండా, నెమ్మదిగా కలపాలి.

పప్పు-ఉసిరి సూప్

ఎలా తీసుకోవాలి: 4-5

కావలసిన పదార్ధాలు:

  • 1/2 కప్పు ఎర్ర కందిపప్పు
  • 1/2 కప్పు పచ్చ పెసరపప్పు
  • 2 లవంగాలు
  • 2-3 మిరియాలు
  • 1/2 కప్పు తరిగిన పాలకూర ఆకులు
  • 1/2 తరిగిన క్యారెట్
  • 1-అంగుళం సైజు అల్లం ముక్క
  • 2 తరిగిన టొమాటోలు
  • చిన్న ముక్కలుగా తరిగిన ఉసిరి కాయలు- 2

చేసే విధానం:

  1. కుండలో, ఉసిరికాయలతో పాటు కాయగూరలన్నీ 4-5 కప్పుల నీటిలో వేసి, కలియబెట్టి. మూత పెట్టాలి. అవి మరగడం ప్రారంభం కాగానే, మంటను లో-ఫ్లేమ్ లేదా సిమ్ లో 15 నిమిషాలు ఉంచాలి లేదా కాయగూరలు మెత్తగా అయ్యేవరకూ ఉంచాలి. మంట పై నుంచి దించేసి, చల్లారిన తరువాత అంతా మెత్తగా కలుపుకోవాలి.
  2. ప్రెజర్ కుక్కర్ ని తీసుకుని, అందులో ఒక టీ-స్పూన్ నెయ్యి వేయాలి. ఎర్ర కందిపప్పు, పెసరపప్పు వేసి బాగా కలపాలి. అందులో నీరు పోసి, ఉప్పు వేసి, ప్రెజర్ కుక్కర్ లో 3-4 విజిల్స్ వచ్చేవరకు ఉడికించిన తరువాత, మంట తీసి వేసి, ఆ ప్రెజర్ కుక్కర్ ను చల్లారనివ్వాలి. ప్రెజర్ కుక్కర్ పై మూత తెరిచి, ఆ మొత్తాన్ని మెత్తని పేస్ట్ లా కలుపుకోవాలి.
  3. ఒక పెద్ద పాన్ తీసుకుని, మీడియం-లో ఫ్లేమ్ పై ఉంచి, అందులో నెయ్యిని వేడిచేయాలి. ఒకసారి అది వేడెక్కిన తరువాత, అందులో మిరియాలు, లవంగాలు వేసి, అవి చిట్లే వరకూ వేగనివ్వాలి. ఇప్పుడు, దానికి అల్లం పేస్ట్ కలపాలి. పచ్చి వాసన పోయాక, దానిలో కాయగూరల పేస్ట్, పప్పు వేసి కలపాలి.
  4. సూప్ కోసం సరిపడినంత నీటిని కలిపి, 5 నిమిషాల పాటు సిమ్ లో ఉంచాలి.
  5. కొత్తిమీరతో అలంకరించండి.

పోషకాలతో కూడిన స్మూధీలు

విటమిన్లను పెంపొందించే స్మూధీ

ఎలా తీసుకోవాలి: 2

కావలసిన పదార్ధాలు:

  • పై తొక్కు తీసి, ముక్కలుగా తరిగిన నారింజ కాయ - 1
  • పై చెక్కు తీసి, ముక్కలుగా తరిగిన కారెట్ - 1
  • తరిగి పెట్టిన వామాకు కాడలు - 2
  • ముక్కలుగా తరిగిన మామిడికాయ - 50 గ్రాములు
  • నీరు - 200ml

చేసే విధానం:

  1. ఈ అన్నిటినీ (నారింజ, కారెట్,వామాకు కాడలు ఇంకా మామిడి) మిక్సర్ లో వేసి, కొద్దిగా నీరు పోసి, మెత్తగా అయ్యేవరకు ఆడించాలి.

కారెట్ - అల్లం స్మూధీ

ఎలా తీసుకోవాలి: free-ym:recipes:carrotGingerSmoothie:servings

కావలసిన పదార్ధాలు:

  • బాగా పండిన పెద్ద అరటిపండు - 1
  • తాజా అనాసపండు(పైన్ ఆపిల్) - 1 కప్పు
  • 1/2 టీ-స్పూన్ తాజా అల్లం
  • 1/4 టీ-స్పూన్ పసుపు (లేదా దాల్చిన చెక్క)
  • క్యారెట్ జ్యూస్ - 1/2 కప్పు
  • నిమ్మ రసం - 1 టీ-స్పూన్ (ఒక చిన్న నిమ్మ చెక్కలో నుండి 1- టీ స్పూన్ లేదా 15 ml రసం వస్తుంది
  • చక్కర/బెల్లం కలపని కొబ్బరి పాలు - 1 కప్పు

చేసే విధానం:

  1. సిద్ధం చేసి పెట్టుకున్న అన్నిటినీ మిక్సర్ లో వేసి, మొత్తని క్రీం అయ్యేంతవరకూ బాగా ఆడించాలి. మిక్సింగ్ బాగా అవ్వకపోతే, మరింత కారెట్ జ్యూస్ లేదా కొబ్బరిపాలు కలపవచ్చు. కడాయి లాంటి నున్నటి అంచులు ఉన్న పాత్ర అవసరం.
  2. రుచి చూసి, దానికి సరిపడా, తీపి కోసం అరటి లేదా అనాస, పులుపు కోసం నిమ్మ, ఘాలుదనం కోసం అల్లం, ఉల్లాసం కోసం పసుపు కలుపవచ్చు.

గ్రీన్ స్మూధీ

ఎలా తీసుకోవాలి: 2

కావలసిన పదార్ధాలు:

  • తొక్క తీసి, తరిగి పెట్టిన అరటిపండు - 1
  • తొక్క తీసిన తాజా అల్లం ముక్క - 1 అంగుళం
  • తాజా పాలకూర - 2 గుప్పెళ్ళు
  • తాజాగా తరిగిన అనాస పండు ముక్కలు - 1 కప్పు
  • కొబ్బరి నీళ్ళు - 1/2 కప్పు
  • బాదం పాలు (లేదా ప్లేన్ గ్రీక్ యోగర్ట్) - 1/2 కప్పు
  • చియా విత్తనాలు - 1 టీ-స్పూన్

చేసే విధానం:

  1. అన్నిటినీ మిక్సర్ లో వేసి కలపాలి. మెత్తగా అయ్యేవరకూ ఆడించాలి.

ఉల్లాసభరితమైన వేడి వేడి 'టీ' లు

పసుపు - అల్లం టీ

ఎలా తీసుకోవాలి: 5

కావలసిన పదార్ధాలు:

  • 5 కప్పుల నీరు
  • ఒక పసుపు పచ్చని నిమ్మపండు తొక్కు - కాయగూరల పీలర్ ను వాడండి
  • 2 అంగుళాల అల్లం ముక్కని పై చెక్కు తీయకుండా, గుండ్రని పొరలు వచ్చేలా సన్నగా తరగాలి
  • 2 అంగుళాల పసుపు దుంపని పై చెక్కు తీయకుండా, గుండ్రని పొరలు వచ్చేలా సన్నగా తరగాలి
  • దంచిన మిరియం - 1
  • 1 నిమ్మ కాయ రసం
  • 1 టీ-స్పూన్ కొబ్బరి నూనె, వెన్న, లేదా అవకాడో నూనె
  • తేనె - 1 టీ-స్పూన్ (పట్టు తేనే శ్రేష్ఠం)

చేసే విధానం:

  1. నీరు, నిమ్మ తొక్కు, అల్లం, పసుపు ఇంకా మిరియం అన్నిటినీ కలిపి సిమ్ - ఫ్లేమ్ పై కొద్దిసేపు ఉంచి, మంటను లో-ఫ్లేమ్ లో పెట్టి 7 నిమిషాలు ఉంచాలి.
  2. మంట ఆర్పేసి, నిమ్మరసం అందులో పిండి, కొబ్బరి నూనె వేసి కలపాలి. టీ ని వడపోసి, 1 టీ-స్పూన్ తేనె కలపాలి. పట్టు తేనెను వాడుతున్నట్లయితే, టీ కొంచెం సేపు చల్లారిన తరువాత కలపడం వల్ల, తేనెలో ఉన్న పోషకాలు కోల్పోకుండా ఉంటుంది. ఇక ఆస్వాదించండి!

నిమ్మ-అల్లం టీ

ఎలా తీసుకోవాలి: 2

కావలసిన పదార్ధాలు:

  • 1 అంగుళం ఉన్న అల్లం ముక్క (పై చెక్కు తీయనవసరం లేదు)
  • 1 కప్పు నీరు
  • 1 టీ-స్పూన్ నిమ్మ రసం (తాజాగా పిండినది)
  • 1 టీ-స్పూన్ తేనె

చేసే విధానం:

  1. నీటిని మరిగించి, స్టవ్ మీద నుండి దించాలి.
  2. నిమ్మకాయని గుండ్రని బద్దలుగా కోయాలి తురుము పట్టుకునే జల్లెడతో అల్లాన్ని తురిమి ఉంచుకోవాలి వేడి నీటిలో వేయాలి.
  3. 5-10 నిమిషాలు అలాగే నాననివ్వాలి.
  4. టీ ని వడకట్టి, మగ్ లో పోసుకోవాలి.
  5. తేనె కలిపి కలియబెట్టాలి. తాగడానికి సిద్ధం!

ఎల్డర్ బెర్రీ టీ

ఎలా తీసుకోవాలి: 2

కావలసిన పదార్ధాలు:

  • 2 కప్పుల నీరు
  • ఎండు ఎల్డర్ బెర్రీలు - 2 టేబుల్ స్పూన్లు
  • పట్టు తేనె (ఆప్షనల్) - 2 టీ-స్పూన్లు

చేసే విధానం:

  1. చిన్న పాన్ లో ఎల్డర్ బెర్రీలు, నీరు పోయాలి
  2. అది మరుగుతున్నప్పుడు, మంట తగ్గించి, 15 నిమిషాలు సిమ్ లో పెట్టాలి ఇలా చేయడం వల్ల ఎల్డర్ బెర్రీలలోని మేలు చేసే గుణాలు బయటికి వస్తాయి.
  3. మంటమీద నుండి తీసివేసి, 5 నిమిషాలు చల్లారనివ్వాలి.
  4. చివరకు, దానిని వడకట్టి, అందరికీ గ్లాస్ లో పోసి సిద్ధం చేయవచ్చు.
  5. తేనెలో కలపి కలియతిప్పాలి.

More Articles

విరామ ఉపవాసం - దానిని సరైన విధంగా చేయండి

చదవండి

ప్రాణాయామం - ప్రాథమిక జీవ శక్తిని అధీనంలోకి తెచ్చుకోవడం

చదవండి

యోగా vs జిమ్

చదవండి

మీ శారీరక ఆరోగ్యాన్ని ఎలా మెరుగుపరచుకోవాలి

చదవండి

షాప్

ఈశా షాపీ

సద్గురు యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి

© 2022, Isha Foundation, Inc.
షరతులు & నిబంధనలు |
గోప్యతా విధానం | పవర్డ్ బై ఫాస్ట్లీ