మనం అసాధారణమైన, అనిశ్చితి నెలకొన్న సమయాలలో జీవిస్తున్నాము. అంతర్జాతీయ మహమ్మారి కరోనా వైరస్ (COVID-19) అమెరికాలో ఇంకా విజృంభిస్తూ ఉండడంతో, మా దైనందిన జీవితాల్లో నాటకీయమైన మార్పులు చోటుచేసుకున్నాయి. తీవ్ర సంక్షోభం నెలకొన్న ఈ తరుణంలో, ఆందోళన ఇంకా ఒత్తిడులు మిమ్మల్ని సులువుగా కుంగదీయగలవు. మీలో ప్రశాంతత, అంతరంగ సమతుల్యత ఇంకా శ్రేయస్సులను కలిగి ఉండడం ఇప్పుడు చాలా ముఖ్యం.
ఈశా ఫౌండేషన్ మీ ఆరోగ్యాన్ని ఇంకా రోగనిరోధక శక్తిని పెంపొందించే యోగిక ఆరోగ్య విధానాలతో పాటు మీ శ్రేయస్సును చేకూరే విధంగా అనేక యోగ మరియు ధ్యాన సాధనాలను ఆన్‌లైన్ ద్వారా అందుబాటులోకి తెస్తుంది.
ఈశా క్రియ అనేది సద్గురు చే రూపొందించబడిన సమర్థవంతమైన గైడెడ్ ధ్యానం. "ఈశా" అంటే ఏదైతే సృష్టికి మూలమో అది. "క్రియ" అంటే ఆ మూలాన్ని కనుగొనే ఆంతరంగిక చర్య.
హార్వర్డ్ మెడికల్ స్కూల్ నిర్వహించిన పరిశోధనలో, ఈ ధ్యాన ప్రక్రియ ద్వారా, ఆందోళన, కోపం, నిస్సత్తువ, కంగారు ఇంకా నిరుత్సాహాలు తగ్గినట్టు ఋజువైంది.
వ్యవధి: 12 - 18 నిమిషాలు
వెబినార్ ద్వారా కూడా అందించబడుతుంది
జీవితంలో మీరు కోరుకున్నదానిని సృష్టించేందుకు మన: శ్శక్తిని ఉపయోగించడాన్ని చిత్ శక్తి అంటారు. చిత్ శక్తి గైడెడ్ ధ్యానాలు నాలుగు, ఉచితంగా అందుబాటులో ఉన్నాయి. అవి మీ జీవితంలో ప్రేమ, ఆరోగ్యం, శాంతి ఇంకా విజయాలను సృష్టించేందుకు సహాయపడతాయి.
వ్యవధి: 20 నిమిషాలు
అనంతమైన ధ్యానం, మనలోని శక్తులలో స్థిరత్వాన్ని మరియు సమతౌల్యతను తీసుకువచ్చేందుకు సద్గురుచే రూపొందించబడింది మనం అవధుల్లేని స్థితిని అనుభూతి చెందేందుకు అది అవకాశాన్ని కల్పిస్తుంది.
వ్యవధి: 30 నిమిషాలు (సూచనలతో కూడి ఉంటుంది)
20 నిమిషాలు (ధ్యానం)
యోగా అందించే శారీరక మరియు మానసిక ప్రయోజనాలను ఆస్వాదించేందుకు సత్వర మార్గం, ఈశా యోగా టూల్స్ యాప్ ను ఉచితంగా డౌన్లోడ్ చేసుకోవడం. యోగ శాస్త్రం ఆధారంగా సద్గురు చే రూపొందించబడిన ఈ 5- నిమిషాల సాధనలు రోజూ చేయడం వల్ల, మీ జీవితాన్ని పరివర్తన చెందించగలవు!
ఇన్నర్ ఇంజినీరింగ్ శ్రేయస్సు చేకూర్చే సాంకేతికత. ఇది యోగ విజ్ఞానం నుండి సంగ్రహించబడినది. జీవితంలోని ప్రాథమిక అంశాలను పరిష్కరించేందుకు ఇంకా ప్రాచీన విజ్ఞానంలో దాగి ఉన్న రహస్యాలను పొందేందుకు, శక్తివంతమైన ఆత్మపరివర్తన ప్రక్రియలు, శాస్త్రీయమైన యోగా సారం, ధ్యాన క్రియల ద్వారా మీరు మీ అత్యుత్తమ సామర్థ్యాన్ని అన్వేషించేలా చేయడం ఈ కార్యక్రమం యొక్క లక్ష్యం.
మీకు వీలైన చోటునుండి, మీకు వీలైనంత సమయంలో, సద్గురుతో ఇన్నర్ ఇంజినీరింగ్ ఆన్‌లైన్(IEO) అనుభూతిని పొందండి. ఇన్నర్ ఇంజినీరింగ్ ఆన్‌లైన్, ప్రాచీన యోగ శాస్త్రం నుండి గ్రహించబడి, మీరు మీ జీవితాన్ని జీవించే, నిర్వహించుకునే ఇంకా అనుభూతి చెందే విధానాన్ని పరివర్తన చెందించే సామర్థ్యం గల శక్తివంతమైన సాధనాలతో కూడిన ఏడు 90-నిమిషాల సెషన్లను కలిగి ఉంటుంది.
యోగ శాస్త్రం, మీ రోగనిరోధక శక్తిని పెంచి, ఇనుమడింపజేసేందుకు ఇంకా మీ మొత్తంగా మీ ఆరోగ్యం ఇంకా శ్రేయస్సుకు దోహదం చేసేందుకు అనేక సహజ నివారణ మార్గాలను తెలియజేస్తుంది.
వేప అనేది వేప చెట్టు నుండి లభించే ఒక సహజ ఓషధి దానిని రోజూ తీసుకోవడం వల్ల జీర్ణకోశ, శ్వాసకోశ, ప్రసరణ వ్యవస్థలు, మూత్రాశయ ఇంకా ప్రత్యుత్పత్తి వ్యవస్థలకు ప్రయోజనం చేకూరుతుంది. విస్తృత స్థాయిలో, వేప అనేది శరీరాన్ని శుద్ధి చేసి ఆరోగ్య కరమైన కణజాలాలను పునరుద్ధరిస్తుంది. వివిధ వైద్య పరమైన ఆధారాల ప్రకారం, ప్రతిరోజూ వేపను తీసుకోవడం వల్ల ఈ క్రింది ప్రయోజనాలు చేకూరతాయి:
పసుపు దుంపల మొక్క నుండి వచ్చే సుగంధ ద్రవ్యం పసుపు. ఆసియాలోని వంటకాలలో పసుపును సర్వసాధారణంగా వాడతారు. కూరల్లో, పసుపు ప్రధానమైనది అని బహుశా మీకు తెలిసే ఉండవచ్చు. ఔషదుల తయారీలో కూడా పసుపును విరివిగా వాడుతారు.
Benefits:రాగి పాత్రలలో ఉంచిన నీరు, మన శరీర వ్యవస్థలో ఉండే వివిధ రకాల విషపదార్థాలను తొలగించడంలో అమోఘంగా పనిచేస్తుంది.
"నీటికీ స్మృతి ఉంటుంది కాబట్టి, దానిని ఎలా మనం నిల్వచేస్తాం అనే దానిపై మనం చాలా పట్టింపుతో ఉంటాం. మీరు నీటిని రాగి పాత్రలో కనీసం నాలుగు గంటల పాటు ఉంచినట్లయితే(రాత్రంతా ఉంచితే మరీ మంచిది), రాగి నుండి ఒక నిర్దిష్టమైన లక్షణాన్ని నీరు పొందుతుంది. అది ముఖ్యంగా మీ కాలేయానికి ఇంకా మీ ఆరోగ్యానికి, శక్తికీ చాలా మంచిది. —సద్గురు
రాగి ఒక సూక్ష్మ జీవ నాశిని కొన్నిసార్లు అది నిమిషాల వ్యవధిలో బాక్టీరియా ఇంకా వైరస్ లను నశింపజేస్తుంది. పరిశోధనా అధ్యయనాలు
ఆయుర్వేద హెర్బల్ జామ్, యాంటీ ఆక్సిడెంట్స్ ను సమృద్ధిగా కలిగి, వయసు పైబడడాన్ని నెమ్మది పరిచే ఫార్ములా. ఇది 4000 సంవత్సరాల నాటి ఫార్ములా, సాంప్రదాయకంగా దీర్ఘాయువు కోసం అమృతంగా ఉపయోగించబడింది. ఒక గొప్ప శక్తివర్ధిని, రోగనిరోధక శక్తిని పెంచుతుంది. అది డీ-టాక్సిఫికేషన్, జీర్ణ క్రియ పనితీరు, రక్తంలో చక్కెర ఇంకా కొలెస్ట్రాల్స్ ను ఆరోగ్యవంతమైన స్థాయిలలో ఉండేలా చేస్తుంది. ఈ రుచికరమైన మిశ్రమం హిమాలయాలలో దొరికే ఉసిరి కాయలను సహజసిద్ధమైన మూలికలు ఇంకా సుగంధ ద్రవ్యాలలో కలిపి తయారుచేయబడింది. ఆయుర్వేద హెర్బల్ జామ్ యవ్వనాన్ని, హుషారుని ఇంకా ప్రాణశక్తినీ పెంపొందిస్తుంది.
మీకు అస్వస్థత లేక అనారోగ్యం కలిగినప్పుడు ఈ వంటకం గొప్ప మేలు చేస్తుంది. కేవలం ఉపశమనాన్ని కలిగించడమే కాకుండా, ఇది విటమిన్లు, ఐరన్ మరియు మెగ్నీషియంలను కలిగి ఉండి, మీ రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయపడుతుంది.
ఎలా తీసుకోవాలి: 3-4
కావలసిన పదార్ధాలు:
చేసే విధానం:
ఎలా తీసుకోవాలి: 2
కావలసిన పదార్ధాలు:
చేసే విధానం:
ఎలా తీసుకోవాలి: 4-5
కావలసిన పదార్ధాలు:
చేసే విధానం:
ఎలా తీసుకోవాలి: 2
కావలసిన పదార్ధాలు:
చేసే విధానం:
ఎలా తీసుకోవాలి: free-ym:recipes:carrotGingerSmoothie:servings
కావలసిన పదార్ధాలు:
చేసే విధానం:
ఎలా తీసుకోవాలి: 2
కావలసిన పదార్ధాలు:
చేసే విధానం:
ఎలా తీసుకోవాలి: 5
కావలసిన పదార్ధాలు:
చేసే విధానం:
ఎలా తీసుకోవాలి: 2
కావలసిన పదార్ధాలు:
చేసే విధానం:
ఎలా తీసుకోవాలి: 2
కావలసిన పదార్ధాలు:
చేసే విధానం: